AP News : రూ.10 వేలు ఇవ్వు.. లేదంటే పక్కలోకి రా.. టీడీపీ నేత వేధింపులు!

కస్తూర్బా స్కూల్లో తన కూతురికి సీటు కావాలని అడిగితే కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. స్కూల్లో సీటు కావాలంటే రూ.10 వేలు డబ్బులు ఇవ్వాలి లేదంటే  ప‌క్కలోకి రావాలని టీడీపీ నేత వన్నూరప్ప వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది.

New Update
atp-tdp

ఒంటరి మహిళపై ఓ టీడీపీ నేత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు,  కస్తూర్బా స్కూల్లో తన కూతురికి సీటు కావాలని అడిగితే కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. స్కూల్లో సీటు కావాలంటే రూ.10 వేలు డబ్బులు ఇవ్వాలి లేదంటే  ప‌క్కలోకి రావాలని టీడీపీ నేత వన్నూరప్ప వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తాను చెప్పిన దానికి ఓకే అంటే స్కూల్లోనే పని ఇప్పిస్తానని,  జీతం రూ. 6 వేలు ఉంటుందని, ఇంటి సంసారం మొత్తం తానే చూసుకుంటానని చెప్పాడని బాధితురాలు వాపోయింది.  సీటు ఇప్పిస్తే ఎంతో కొంత డబ్బులు ఇస్తాను కానీ గలీజు మాటలు మాట్లాడితే  చెప్పుతో కొడతానని వన్నూరప్పకు బాధితురాలు వార్నింగ్ ఇచ్చింది. మరోసారి ఫోన్ చేస్తే అస్సలు బాగోదని హెచ్చరించింది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Advertisment
తాజా కథనాలు