/rtv/media/media_files/2025/12/10/assault-case-against-student-in-tirupati-2025-12-10-07-16-18.jpg)
S*xual Assault case against student in Tirupati, Two professors arrested
ఏపీలోని తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు లెక్చరర్లను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా డీఎస్పీ భక్తవత్సవం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి జాతీయ సంస్కృతి యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన యువతి (27) బీఈడీ ఫస్ట్ ఇయర్ చదవుతోంది. వర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.లక్ష్మణ్ కుమార్.. ఆ విద్యార్థిని ప్రలోభపెట్టాడు. తన ఆఫీసు గదిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Also Read: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడులు
అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎ.శేఖర్‌రెడ్డి ఆ ఆఫీసు కిటీకి బయట నుంచి ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ ఆ విద్యార్థిని వేధించారు. చివరికి ఆ విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో డా.లక్ష్మణ్ కుమార్‌ను వారు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఈ కేసులో నిందితులైన లక్ష్మణ్‌కుమార్, శేఖర్‌రెడ్డిలను అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Also Read: తెలంగాణలో సల్మాన్ ఖాన్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. ఎక్కడ, ఏ రంగంలో అంటే?
Follow Us