/rtv/media/media_files/2025/11/22/fotojet-2025-11-22t072022525-2025-11-22-07-20-51.jpg)
Suicide attempt for girlfriend
Crime: అతనికి పెళ్లయింది. ఒక పాప కూడా ఉంది. అయినా మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ప్రేమించిన అమ్మాయిని ఏకంగా ఇంటికి తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబసభ్యులు అతని ఇంటికి వచ్చి గొడవ చేశారు. అంతేకాదు ఆమెను తిరిగి ఊరికి తీసుకెళ్లారు. దీంతో మనస్థాపానికి గురైన అతను .. ‘నా నుంచి ఆమెను దూరం చేయకండంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రియురాలి కోసం ఆత్మహత్యయత్నం చేసిన భర్తను చూసి మరో మహిళా అయితే పోతే పోనీ అని ఊర్కోలేదు. చూస్తూ..చూస్తూ చంపుకోలేక అతడ్ని ఆసుపత్రికి చేర్చింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కలిగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది.
కలిగిరి మండలంలోని ఏపినాపి గ్రామానికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్‌కు ఎనిమిదేళ్ల క్రితం సరిత అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. విష్ణువర్ధన్ అనకాపల్లి సమీపంలోని ఇటుకబట్టీల్లో మూడేళ్లుగా భార్యతో కలిసి పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో అక్కడే పనిచేస్తూ భర్తకు దూరంగా ఉంటున్న ఎం.ధనలక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్తను వదిలేసి కొన్ని నెలలుగా ఏపినాపిలో అత్తామామల దగ్గరకు వెళ్లిపోయింది. ఇలా ఉండగానే ఇటీవల విష్ణువర్ధన్ ధనలక్ష్మిని తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఈనెల 16న ధనలక్ష్మీ కనిపించడం లేదని అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వీరిద్దరూ ప్రకాశం జిల్లా పామూరులోని ఓ లాడ్జిలో ఉన్నట్లు బుధవారం భార్య సరితకు తెలియడంతో వారిని పోలీసుల సాయంతో కలిగిరికి తీసుకొచ్చారు. తర్వాత తన పరిస్థితి ఏంటని భార్య నిలదీసింది.
ఈ నేపథ్యంలో కుటుంబ ఆస్తి తనకు వద్దని విష్ణువర్ధన్ సంతకం చేసి, ఆ ప్రతులను భార్యకు ఇచ్చారు. ఇదిలా ఉండగానే అనకాపల్లి పోలీసులు, ధనలక్ష్మి కుటుంబసభ్యులు సమాచారం తెలుసుకుని శుక్రవారం కలిగిరి పోలీసుస్టేషన్‌కు వచ్చారు. అక్కడ కొంత గొడవ అనంతరం ధనలక్ష్మిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లడంతో విష్ణువర్ధన్ సమీపంలోని దుకాణంలోకి వెళ్లి పురుగులమందు డబ్బాను కొనుక్కోని అందరూ చూస్తుండగానే రోడ్డుపై తాగేశాడు. గమనించిన భార్య, బంధువులు వెంటనే ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
Follow Us