Srisailam: శ్రీశైలం దేవస్థానంలో ఓ భారీ అవినీతి తిమింగలం బాగోతం బయటపడింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆలయం దగ్గర పుట్టిన రోజు, దీపావళి వేడుకలు చేసుకున్న మహారాష్ట్ర భక్తులు. ఆ విషయం తెలిసిన సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న కి తెలిసింది.
Also Read: Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్
దాంతో వారి మీద సెక్యూరిటీ అనుమతి లేకుండా ఎలా చేస్తారని అయ్యన్న చిందులు వేశారు. గణేష్ సదన్ లో ఉన్న మహారాష్ట్ర భక్తుల పై దురుసుగా ప్రవర్తించారు. భక్తులు తెచ్చుకున్న రెంట్ సామాను కూడా ఇవ్వనివ్వకుండ అడ్డుకున్న అయ్యన్న.
Also Read: KTR: నన్ను కాదు.. దమ్ముంటే మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి: రేవంత్ కు కేటీఆర్ సవాల్!
ఈ బాగోతం ఇలా ఉంటే..కేసు కాకుండా ఉండాలంటే.. రూ. 15 వేలు లంచం ఇవ్వాలని మధ్యవర్తి ద్వారా రాయబారం పంపిన సెక్యూరిటీ అధికారి.
Also Read: Yadadri Temple Name Change: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!
దీంతో ఏం చేయాలో తెలియని భక్తులు మధ్యవర్తికి రూ. 5 వేలు క్యాష్ గా, మరో 6 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఇచ్చారు. దీంతో ఈ విషయం గురించి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న పై ఆలయ ఈవోకు లిఖిత పూర్వక ఫిర్యాదును వారా కడిమి అనే భక్తుడు ఇచ్చాడు. గతంలో దేవస్థానం పెట్రోల్ బంక్ అక్రమాల్లో అయ్యన్న కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు.