షాకింగ్ వీడియో.. నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని కొట్టుకున్న మహిళలు..

వైజాగ్‌లోని గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారులు నడిరోడ్డు పై కొట్టుకున్నారు. మహిళలు సైతం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకున్నారు. అడ్డుకోబోయిన ఓ యువకుడిని సైతం తీవ్రంగా కొట్టారు. ఒకరు దుకాణం పెట్టుకున్న ప్రాంతంలో మరొకరు వచ్చి చేరడంతో వివాదం మొదలైంది.

New Update
Small traders clash

సాధరణంగా కొందరు మహిళలు గొడవకు దిగారంటే వారిని విడిపించడం చాలా కష్టం. మధ్యలోకి వెళ్లి విడిపించే ప్రయత్నం చేసిన వారి పని ఖతం అనే చెప్పాలి. అంతలా గొడవ పడతారు. ఆ గొడవ మాటల వరకు అయితే ఓకే కానీ.. చేతుల వరకు వెళ్లిందంటే అంతా సంగతి. నడిరోడ్డు అయినా పట్టించుకోరు. జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు. 

Also Read :  డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

జుట్టు పట్టుకుని ఈడ్చుకున్నారు

తాజాగా అలాంటిదే జరిగింది. వైజాగ్‌లోని గాజువాకలో దారుణ ఘటన జరిగింది. గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారులు నడిరోడ్డు పైనే కొట్టుకున్నారు. మహిళలు సైతం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకున్నారు. అందరూ చూస్తుండగానే పరస్పరం జుట్లు పట్టుకుని దాడులు చేసుకున్నారు. 

Also Read : 11వ తరగతి ఖతర్నాక్ కుర్రోడు.. 200 మందిని నిలువునా ముంచేశాడు..!

ఇక ఈ తతంగాన్ని అడ్డుకోబోయిన ఓ యువకుడిని సైతం తీవ్రంగా కొట్టారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను తప్పించడం ఎవరితరం కాలేదు. ఇద్దరు వ్యక్తుల బాహాబాహీ పిడి గుద్దులతో రెచ్చిపోయారు.

Also Read :  వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ!

ఒకరు దుకాణం పెట్టుకున్న ప్రాంతంలో మరొకరు వచ్చి చేరడంతో వివాదం మొదలైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో సర్దుమనిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చదవండి: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!

Advertisment
తాజా కథనాలు