/rtv/media/media_files/2025/07/22/gandikota-2025-07-22-10-53-50.jpg)
Gandikota
Gandikota Inter Girl Murder Case : కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కేసును కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాలిక సోదరులే హంతుకులని నిర్ధారించారు పోలీసులు. ప్రేమ వ్యవహారం.. కుటుంబ పరవువుతీస్తోందనే బాలికను ఆమె అన్నలు హతమార్చినట్లు తెలిపారు. బాలిక, బాలిక లవర్ లోకేష్ వేర్వేరు కులాలు కావడం.. ఆస్థిపాస్తుల్లోనూ తమతో సరితూగరనే భావనలో బాలిక బంధువులు ఉండడం.. ఇవే హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు.. ఇన్‌స్టాగ్రాం చాటింగ్ లోనూ హత్య వ్యవహారాన్ని గుర్తించారు. మరిన్ని సాంకేతిక ఆధారాలకోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
ఈ క్రమంలోనే యువతిని చంపేందుకు 3నెలల ముందు నుంచే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారమే చెల్లిని అన్నలు చంపినట్లు తేలింది. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో సొంత అన్న బ్రహ్మయ్య, పెద్దనాన్న కొడుకు కొండయ్య యువతి బావ తోట సుబ్రహ్మణ్యం, మరో బంధువు సుబ్బయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. యువతి మరో అన్న సురేంద్ర పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.హత్యలో ఎవరెవరు సూత్రదారులు, పాత్రదారులు. అని తేల్చే పనిలో జమ్మలమడుగు పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు.
Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్