AP:
ఏపీ నుంచి శబరిమలకు వెళ్లాలనుకునే అయ్యప్ప భక్తులకు రైల్వే అధికారులు తీపి కబురు చెప్పారు.విజయవాడ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం-కొల్లాం (07145) స్పెషల్ ట్రైన్ డిసెంబరు 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.15కి బయలుదేరుతుంది.. మరుసటి రోజు రాత్రి 9.20కి కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు (07146) తిరుగు ప్రయాణంలో డిసెంబరు 4, 11, 18 తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2.30కి బయలుదేరి రెండో రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
Also Read: TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు
ఈ రైలు ఏపీలోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనుంది.మరో ప్రత్యేక రైలు (07147) మచిలీపట్నం-కొల్లాం మధ్య నడవనుంది. డిసెంబరు 23,30 తేదీల్లో మచిలీపట్నంలో మధ్యాహ్నం 12గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.20కి కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు (07148) తిరుగు ప్రయాణంలో డిసెంబరు 25, జనవరి ఒకటో తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2.30కి బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
Also Read: Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు!
ఈ రైలు ఏపీలోని.. మచిలీపట్నం, పెడన, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనుంది.మౌలాలి-కొల్లాం (07143) ప్రత్యేక రైలు డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మౌలాలీలో మధ్యాహ్నం 11.30కు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కొల్లాం చేరుతుంది. ఈ రైలు (07144) తిరుగు ప్రయాణంలో డిసెంబరు 8, 15, 22, 29 తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2.30కి బయలుదేరి రెండో రోజు ఉదయం 10 గంటలకు మౌలాలీ చేరుతుంది.
Also Read: AP Rains: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం... ఆ రెండు రోజులు వానలే వానలు!
ఈ రైలుకి తెలంగాణలోని మౌలాలి, చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం రైల్వేస్టేషన్‌లలో స్టాప్ ఉంది. ఏపీలోని.. విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనుంది. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ బుధవారం ఉదయం 8 గంటల నుంచి మొదలు కానుందని అధికారులు తెలిపారు.