AP ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. నెల రోజుల్లోనే..

ఎస్సీ వర్గీకరణ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉపకులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమిచ్చేలా పని చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

cbn
New Update

AP News : ఎస్సీ వర్గీకరణ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం జిల్లా యూనిట్‌ గా వర్గీకరణ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అధ్యయానికి త్వరలో కమిషన్‌ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం లేకుండా నెల రోజుల్లోపే నివేదిక అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. 

Also Read: Khammam: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు షాక్..తొలగిస్తూ ఉత్తర్వులు

SC Reservation Categorization

వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉపకులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమిచ్చేలా పని చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు కార్యాచరణ , దళితుల సంక్షేమం, అభివృద్దికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి టీడీపీ జనసేన దళిత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో గురువారం సుదీర్ఘంగా చర్చించారు.

Also Read:  AP Liquor Policy: ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్..!

ఏ వర్గానికీ అన్యాయం జరగకుండా జనాభా ప్రాతిపదికన ఆయా స్థాయి పోస్టులకు అనుగుణంగా జిల్లా, జోనల్‌, రాష్ట్ర స్థాయి యూనిట్‌ గా రిజర్వేషన్లు అమలు చేయాలని సమావేశంల నిర్ణయించారు. రిజర్వేషన్లను గతంలో మాదిరి ఏ,బీ,సీ,డీ నాలుగు రకాలుగా కాకుండా ఏ,బీ,సీ అనే మూడు కేటగిరీలుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కోరారు. 

Also Read:  Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్‌

డీ కేటగిరీలోని ఆది ఆంధ్రా, ఇతర సామాజిక వర్గానికి చెందిన వాఉ బీ, సీ లోని కులాలకు ఉపకులాలే అయినందున ఆయా కేటగిరీలలోనే వారిని చేర్చాలని సూచించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తమిళనాడులో 18 శాతం ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున రాష్ట్రంలోని ప్రస్తుత ఎస్సీ జనాభాను ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లు అమలు చేయాలని విన్నవించారు.

Also Read: Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే..

దీని పై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మనమే ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. తర్వాత న్యాయ సమస్య కారణంగా అది నిలిచిపోయింది. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుతో పాటు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చాం. టీడీపీ ముందు నుంచి కూడా దళితులకు అండగా ఉంది. 

జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ద్వారా అంటరాని తనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపం. 2014 తర్వాత జీఓ 25ను తెచ్చి దళితులకు జనాభా దామాషా ప్రకారమే నిధులు వెచ్చించాం. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో వర్గీకరణ పై స్పష్టత వచ్చినందున అమలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

#andhra-pradesh #chandrababu #sc-reservations
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe