Tirumala: తిరుమల శ్రీవారి హుండీలో పట్టపగలే చోరీ..ఆలస్యంగా వెలుగులోకి!

తమిళనాడుకు చెందిన వేణులింగం అనే యువకుడు ఈ నెల 23న మధ్యాహ్నం తిరుమల శ్రీవారి ఆలయం హుండీ నుంచి డబ్బులు దొంగతనం చేశాడు.. అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

TTD 2
New Update

Tirumala: క‌లియుగ వైకుంఠ దైవ‌మైన శ్రీ వెంక‌టేశ్వ‌రస్వామి ఆల‌యంలోని హుండీలో చోరి జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వెంక‌టేశ్వ‌ర స్వామి హుండీలోని నగదును ఓ యువకుడు దొంగిలించాడు. ఈ దొంగతనం దృశ్యాలు ఆల‌యంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీని ఆధారంగానే ఆల‌య భ‌ద్ర‌తా సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు.

Also Read: ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు

శ్రీ‌వారి ఆల‌యంలో నవంబర్ 23వ తేది మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టీల్ హుండీలో నగదును ఓ యువ‌కుడు దొంగలించే ప్రయత్నం చేశాడు. ఆ నేప‌థ్యంలో హుండీలోని కొంత నగదును తస్కరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయమంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో ఈ విషయాన్ని ప‌రిశీలించిన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని గుర్తించి పట్టుకున్నారు.

Also Read: ఫ్యాన్స్ కు లైవ్ లో నాగచైతన్య పెళ్లి చూసే అవకాశం.. ఎలాగో తెలుసా..!

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఆ యువ‌కుడి కోసం భ‌ద్ర‌తా సిబ్బంది గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అదే రోజు సాయంత్రం 6.00 గంటలకు ఆ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆ త‌ర్వాత ఆ యువ‌కుడిని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. యువకుడ్ని అధికారులు తమదైన స్టైల్‌ లో  విచారించగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. 

Also Read: పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థులు.. కనిపిస్తే కాల్చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు

నిందితుడి దగ్గర నుంచి 15వేల రూపాయ‌లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఆల‌యంలో చోరి చేసిన వ్య‌క్తిని త‌మిళ‌నాడుకు చెందిన వేణులింగంగా గుర్తించారు. అతడు శంకరన్ కోవిల్ నివాసి అని సమాచారం. అనంత‌రం ఆ యువ‌కుడిని పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులకు  అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగ‌వంతం చేశారు.

Also Read: BJP: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం!

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe