AP News: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. పూతలపట్టు నాయుడుపేట నేషనల్ హైవేపై దగ్గర బుధవారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. బంధువుల గృహ ప్రవేశం కోసం బెంగళూరు నుంచి కేవీబీపురంకు కారులో వెళ్తుండగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Karnataka: 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున..బీజేపీ బంపరాఫర్!
మరో ఘటనలో అంతా సురక్షితం:
మహారాష్ట్రలో మరో ప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లాలో అంబులెన్స్ ఇంజిన్‌లో మంటలు చెలరేగి ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో గర్భిణితో పాటు ఆమె కుటుంబం ప్రాణాలతో బయటపడ్డారు. నిన్న జరిగిన ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఆక్సిజన్ సిలిండర్ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇండ్ల అద్దాలు సైతం పగిలిపోయాయి.
ఇది కూడా చదవండి: మయోనైస్ ఎందుకు అంత ప్రమాదకరం?
స్థానిక సమాచారం ప్రకారం.. ఓ గర్భిణితో పాటు కుటుంబ సభ్యులు ఎరండోల్ ప్రభుత్వ ఆస్పత్రి వెళ్తోంది. జల్గావ్‌లోని దాదావాడి సమీపంలోని హైవేపై ఒక్కసారిగా అంబులెన్స్‌లో పేలుడు సంభవించింది. ఇంజిన్‌లో నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్ వాహనంలో ఉన్న గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులను దింపివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకుండా.. అంబులెన్స్‌లో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ భారీ శబ్దంతో పేలిపోవటంతో అక్కడి వారంతా అప్రమత్తమయ్యారు.
ఇది కూడా చదవండి: భోజనం తర్వాత ఇలా చేశారంటే లివర్ పాడైపోతుంది
ఇది కూడా చదవండి: మినరల్ వాటర్ అమ్మే బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు