Mayonnaise: మయోనైస్ ఎందుకు అంత ప్రమాదకరం? మయోనైస్‌లో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. మయోనైస్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 మార్కెట్లో లభించే మయోనైస్‌లో చాలా రకాల హానికరమైన రసాయనాలను వాడుతున్నారు. సోర్బేట్స్, బెంజోయేట్స్ వంటివి మయోన్నైస్ తయారీలో ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. మార్కెట్లో లభించే మయోనైస్‌లో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రసాయనాలు కలుపుతారు. 2/6 ప్రిజర్వేటివ్లలో మోనోసోడియం గ్లుటామేట్ ఉంటుంది. ఇది శరీరంలోకి చేరిన తర్వాత ఫుడ్ పాయిజనింగ్, వికారం, తలనొప్పి, బలహీనత వంటి సమస్యలను కలిగిస్తుంది. శాండ్విచ్లు, మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, మయోనైస్‌లో ముంచుకుని తింటుంటే జాగ్రత్తగా ఉండాలి. మయోనైస్ ఫాస్ట్ ఫుడ్స్‌తో తింటే ఆరోగ్యానికి హానికరం. బరువు పెరగడం, జీర్ణక్రియ వంటి అనేక సమస్యలు వస్తాయి. మయోన్నైస్ గుండె, ఇతర అవయవాలకు కూడా హానికరం. 3/6 మయోనైస్ నూనె, గుడ్డు పచ్చసొన, నిమ్మరసం లేదా వెనిగర్ నుండి తయారు చేస్తారు. రుచిని మెరుగుపరచడానికి, ఉప్పు, ఎండుమిర్చి, తెల్ల ఆవాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతారు. మార్కెట్లో లభించే మయోనైస్‌లో చాలా రకాల హానికరమైన రసాయనాలు వాడుతున్నారు. 4/6 మయోనైస్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో కేలరీల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల పొట్ట కొవ్వు, ఊబకాయం వేగంగా పెరుగుతుంది. 5/6 మయోనైస్‌లో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. మయోనైస్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. 6/6 మయోనైస్ అధిక మొత్తంలో రక్తపోటును పెంచుతుంది. ఇందులో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి బీపీని పెంచుతాయి. దీన్ని తీసుకోవడం పక్షవాతం, మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతాయి. #mayonnaise మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి