Road Accident: ఉద్దండపురం జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం!

నక్కపల్లి జాతీయ రహదారి పై ఉద్దండపురం వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొడిచెర్లకు చెందిన కిల్లాడ నాగేశ్వరరావు(24), ఆవాల నవీన్‌ (18)అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

New Update
Road Accident rangareddy

Road Accident: నక్కపల్లి జాతీయ రహదారి పై ఉద్దండపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నక్కపల్లి సీఐ కుమారస్వామి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నక్కపల్లి మండలం గొడిచెర్లకు చెందిన కిల్లాడ నాగేశ్వరరావు(24), ఆవాల నవీన్‌ (18) దేవవరానికి చెందిన దమ్ము సీతయ్య ద్విచక్ర వాహనం పై వేంపాడు వద్ద ఓ దాబాలో టిఫిన్‌ చేసేందుకు వెళ్లారు. వీరు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఉద్దండపురం సమీపానికి చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. 

ఈ ఘోర ప్రమాదంలో నాగేశ్వరరావు, నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సీతయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సీఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తుని ప్రాంతీయాసుపత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద తీవ్రతకకు మృతుల బండి నుజ్జునుజ్జు అయ్యింది.

మృతులు కూలి పని చేసుకుని జీవించేవారని తెలుస్తుంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించడంతో ఆ ప్రాంతామంతా భీతావహంగా మారింది. కేసు నమోదు చేసుకున్న సీఐ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Also Read: మాజీ మంత్రి బొత్సకు బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు