AP News: ఎకరాకు రూ.31 వేలు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన!

ఏపీ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లాలో  497 ఎకరాల్లో CBG ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేలు కౌలు ఇస్తామని ప్రకటించారు. 

New Update
lokesh

lokesh Photograph: (lokesh)

AP News: ఏపీలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(CBG) ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠితో కలిసి భూమిపూజ చేశారు.

తొలిప్లాంటుకు శంకుస్థాపన..

ఈ సందర్భంగా దివాకరపల్లి వద్ద 497 ఎకరాల్లో, రూ.139 కోట్ల పెట్టుబడితో, 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటుచేస్తోందని చెప్పారు. రిలయన్స్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలిప్లాంటుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన P4 విధానానికి రిలయన్స్ సీబీజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయన్నారు.

ఇది కూడా చదవండి: విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు

కనిగిరి నియోజకవర్గం దివాకరపురంలో మొదటి సీబీజీ ప్లాంట్ కు శంకుస్థాపన అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించిన ఆయన.. ఎలాంటి నీటివసతి లేని మెట్టప్రాంత రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు. నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చేస్తారు. ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేలు కౌలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చేయడమే మా లక్ష్యమని వివరించారు. 

ఇది కూడా చదవండి: సోడా తాగడం వల్ల నిజంగా గ్యాస్ నయమవుతుందా?

ap minister nara lokesh | ongole | factory | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు