Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ అరెస్ట్?

AP: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో అవినాష్ పీఏ రాఘవ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో అతన్ని అదుపులోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం అవినాష్ పీఏ పరారీలో ఉన్నట్లు సమాచారం.

MP Avinash Reddy: 66 వేల ఓట్ల ఆధిక్యంలో అవినాష్ రెడ్డి..!
New Update

YCP MP Avinash Reddy : వైసీపీకి బిగ్  షాక్ తగిలేలా కనిపిస్తోంది. కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ అవినాష్‌ పీఏ రాఘవ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. పోలీసులకు చిక్కుండా అండర్‌గ్రౌండ్‌లో అవినాష్‌ పీఏ ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ఎంపీ అవినాష్‌ పీఏ అనుచిత పోస్టులు పెట్టాడు. అవినాష్‌ పీఏ అందుబాటులో లేకపోవటంతో తండ్రితో పోలీసులు మాట్లాడారు. కాగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

Also Read :  Vivian Jenna Wilson: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన

Also Read :  Yadadri Temple Name Change: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

వైసీపీ ఎమ్మెల్యేపై కూడా....

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిలో ఎమ్మెల్యేలను సైతం పోలీసులు వదలడం లేదు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ పెద్దలపై, మహిళలు, అలాగే చిన్నారులపై అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. తాటిపర్తి  చంద్రశేఖర్ పై యర్రగొండపాలెంలో కేసు నమోదు అయింది. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్ట్ చేయడంపై టీడీపీ నేతపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కాగా ఒక ఎమ్మెల్యేపై కేసు నమోదు అవ్వడం ఇదే తొలిసారి.

#ycp-mp #social-media #mp-avinash-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe