/rtv/media/media_files/2025/11/01/pm-modi-mourn-loss-of-lives-in-srikakulam-stampedetragedy-2025-11-01-14-57-49.jpg)
PM Modi Mourn Loss of Lives in Srikakulam StampedeTragedy
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించారు. '' శ్రీకాకుళం జిల్లాలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన జరగడం చాలా బాధాకరం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని'' మోదీ అన్నారు. అలాగే మృతుల కుటంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందిస్తామని PMO కార్యాలయం ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— PMO India (@PMOIndia) November 1, 2025
ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్…
Also Read: నిశ్చితార్థానికి ముందు ఊహించని ట్విస్ట్! వధువు తండ్రితో వరుడి తల్లి జంప్
ఈ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇదిలాఉండగా శనివారం ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. దీంతో కొందరు భక్తులు స్పృహ తప్పి పడిపోగా 10 మంది ప్రాణాలు కోల్పోయినట్ల తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు.
Also Read: బిగ్ షాక్.. ఆ వీడియోలు చేస్తే రూ.12 లక్షలు ఫైన్!
మరోవైపు సీఎం చంద్రబాబు కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని అధికారులు,ప్రజా ప్రతినిధులను కోరారు.
Follow Us