/rtv/media/media_files/2025/04/08/Rb6rIuZEe67DQ6JzdTdu.jpg)
Pawan Kalyan younger son
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదం వల్ల చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల దీర్ఘకాలికంగా సమస్యలు వస్తాయని అంటున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి:Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
అగ్ని ప్రమాదం జరగడంతో..
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చదువుకుంటున్నాడు. ఈ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరగడంతో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ మన్యం పర్యటన తర్వాత సింగపూర్ వెళ్లారు.
ఇది కూడా చూడండి:USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
ఇదిలా ఉండగా.. తన కొడుకుకు సంభవించిన ప్రమాదం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. సింగపూర్‌లోని ఓ సమ్మర్ క్యాంప్‌లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అక్కడే ఉన్నాడు. ఈ ఫైర్ యాక్సిండెంట్‌లో అతని చేతులు, కాళ్లకు గాయాలైయ్యాయని పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు.
ఇది కూడా చూడండి:Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు
Heard the Terrible news about the 8 year old Son of #PowerStar@Pawankalyan, Master Mark Shankar Pawanovich is injured in a fire accident in #Singapore.
— Zbigniew A C (@ZbigsZach) April 8, 2025
My prayers are with the family and for the speedy Recovery of #MarkShankarPawanovich
Let's all pray and support for the… pic.twitter.com/jJJNNuWs2z