Pawan: అల్లు అర్జున్ ఇష్యూపై తొలిసారి స్పందించిన పవన్.. వారిపై ఫైర్!

ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించేందుకు కడప వెళ్లిన పవన్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యారు. 'ఓజీ' అని నినాదాలు చేయడంతో ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదా అంటూ తిట్టారు. అల్లు అర్జున్ ఇష్యూపై మీడియా ప్రశ్నించగా.. అది అనవసర విషయం. రాజకీయాలగురించే మాట్లాడాలన్నారు.

author-image
By srinivas
New Update
pawan allu arjun

అల్లు అర్జున్ వివాదంపై స్పందించని పవన్ కళ్యాణ్

Pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు సినిమాల గురించి ప్రస్తావించిన ఫ్యాన్స్‌కు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు అల్లు అర్జున్ గురించి మీడియా ప్రశ్నించగా మనుషులు చచ్చిపోతుంటే పనికిమాలిన విషయాలు అడుగుతారేంటి? సీరియస్ అంశాలపై ప్రశ్నలడగండి అని సూచించారు. 

గౌరవం లేదా..

ఈ మేరకు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించేందుకు వెళ్లారు పవన్. అతన్ని కలిసి దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు.

ఇది కూడా చదవండి: R Pant: స్టుపిడ్‌ షాట్.. గెట్‌అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్

ఏ స్లోగన్‌ ఇవ్వాలో తెలియదా..

ఇక ఇదే క్రమంలో బన్నీ ఇష్యూపై మీడియా ప్రశ్నించగా స్పందించేందుకు ఇష్టపడలేదు. ఆ విషయం ఇప్పుడు అవసరమా? సినిమా ఇండస్ట్రీ గురించి ఇప్పుడు ఎందుకు? అని సీరియస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. పవన్‌ని చూసేందుకు అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అత్యుత్సాహం చేశారు. సీరియస్‌గా మీడియాతో మాట్లాడుతుండగా.. ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ అరిచారు. వెంటనే ‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు వెళ్లండి' అంటూ ఫైర్ అయ్యారు. 

Advertisment
తాజా కథనాలు