HHVM : మనల్ని ఎవడ్రా ఆపేది.. వైసీపీ నేత వాహనాన్ని అడ్డుకుని పవన్ అభిమానులు రచ్చ రచ్చ!

తాజాగా పశ్చిమగోదావరి  జిల్లాలోని తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వాహనాన్ని అడ్డుకున్నారు పవన్‌ కల్యాణ్ అభిమానులు. హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా అభిమానుల బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో కారుమూరి వాహనాలు

New Update
pawan-kalyan-ycp

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా, సినీ, రాజకీయ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల సందర్భంగా ఏపీలో అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి  జిల్లాలోని తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వాహనాన్ని అడ్డుకున్నారు పవన్‌ కల్యాణ్ అభిమానులు.

అభిమానుల బైక్‌ ర్యాలీ

హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా అభిమానుల బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో కారుమూరి వాహనాలు రోడ్డుపైన వెళ్తుండగా అడ్డుకుని హడావుడి చేశారు. ప్రచార రథంపైకి ఎక్కి జనసేన జెండాలతో  హల్‌చల్‌ చేశారు పలువురు యువకులు. ప్రచార రథం వెనక తన వాహనంలోనే చూస్తూ ఉండిపోయారు కారుమూరి.  పవన్ అభిమానులు హంగామా అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావడంతో ఆయన వెళ్లిపోయారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

Advertisment
తాజా కథనాలు