AP News: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు!
ఏపీలో మరో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు పడింది. మాజీ సీఎం జగన్ పేషీలో పని చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ సీఎస్ సౌరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.