Kambham Cheruvu : కనుమరుగవుతున్న అతి పెద్ద చెరువు.. పట్టించుకోని పాలకులు..!
ప్రకాశం జిల్లాలో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న కంభం చెరువు పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడిక పేరుకుపోయింది. నీరు అడుగంటి పోవడంతో రైతాంగం అయోమయంలో పడింది. చెరువును అధికారులు ఏ మాత్రం పట్టించుకోనట్లు తెలుస్తోంది.