AP Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన
AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి రామ్‌ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దీనిపై ఈ నెల 12న సీఎం చంద్రబాబు రవాణాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.