AP : వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి
వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారనేది ప్రజలందరికీ తెలుసన్నారు. ఈవీఎంలపై అనుమానం ఉండడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.