Ongole Recounting: ఏమవుతుంది? ఒంగోలులో ఈవీఎంల రీకౌంటింగ్.. టెన్షన్! గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను తిరిగి లెక్కిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు చేపట్టింది. నాలుగు రోజుల పాటు ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. By KVD Varma 19 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ongole Recounting: ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియ అంటే.. ఎలక్షన్స్ జరగడం.. ఫలితాలు ప్రకటించడం.. ప్రభుత్వం ఏర్పాటు కావడం. ఎక్కడైనా అభ్యర్థులు ఫిర్యాదులు చేస్తే వాటిని పరిశీలించి పరిష్కరించడం.. ఇలాంటివి అన్నీ మనకు తెలుసు. కానీ, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు రెండు నెలల తరువాత రీ కౌంటింగ్ జరగబోతోంది. అది కూడా 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను రీకౌంటింగ్ చేస్తున్నారు. అందరిలోనూ ఈ రీకౌంటింగ్ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం కౌంటింగ్ పై తనకు అనుమానాలున్నాయని మాజీ మంత్రి బాలినేని ఫిర్యాదు చేశారు. 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహించాలని బాలినేని కోరారు. దీంతో ఈసీ స్పందించింది. ఈ 12 కేంద్రాల ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహించడానికి సిద్ధం అయింది. Ongole Recounting: ఈరోజు నుంచి మొదలైన ఈవీఎం రీకౌంటింగ్ ప్రక్రియ నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. రోజుకు మూడు కేంద్రాల ఈవీఎంల చొప్పున రీకౌంటింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలను భద్రపరిచిన ఒంగోలు లోని భాగ్యనగర్ గోడౌన్ లో కాంటింగ్ జరుగుతోంది. దీనిని పర్యవేక్షించడానికి ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారి హాజరయ్యారు. స్పెషల్ కలెక్టర్ ఝాన్సీ లక్షిని నిర్వహణ అధికారిగా జిలా కలెక్టర్ తమీమ్ అన్సారీయా నియమించారు. ఝాన్సీ లక్ష్మి పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ చేశారు. రీకౌంటింగ్ జరిపించాలంటే ఈసీకి ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం రీకౌంటింగ్ కోరిన బాలినేని శ్రీనివాస్ 5.44లక్షల కోట్ల రూపాయలను చెల్లించారు. ఈ రీకౌంటింగ్ ప్రక్రియలో ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేనితో సహా 26 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. #recounting #ongole మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి