/rtv/media/media_files/2024/12/06/Ukc8wyH8F0bT4afjwGWk.jpg)
Polavaram Project: పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్ట్ లో ఆంధ్ర ప్రదేశ్ ఆక్టోపస్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాద దాడి జరిగినప్పుడు, అసాంఘిక శక్తులు విజృంభించినపుడు భద్రతా బలగాల సంసిద్ధతను పరీక్షించే లక్ష్యంతో జరిగిన ఈ కసరత్తు ఆక్టోపస్ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో జరిగింది. స్థానిక పోలీసులు, పోలవరం ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షిస్తున్న SPF సిబ్బంది, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ MEIL సిబ్బంది సహకారంతో ఈ డ్రిల్ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ వంటి భారీ నిర్మాణాలను ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు స్పందించటంతో పాటు, వారిని సమర్ధంగా తమ శక్తి సామర్ధ్యాలు, ఆయుధ సంపత్తితో వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కొంటారో ఈ మాక్ డ్రిల్ లో ఆక్టోపస్ పోలీస్ లు ప్రదర్శించారు.
Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!
పోలీస్‌ల సంసిద్ధతను అంచనా...
ఈ డ్రిల్‌లో ఆక్టోపస్ సిబ్బందితో పాటు, స్థానిక పోలీస్ లు, ప్రాజెక్ట్ రక్షణ సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ భద్రతా వివిధ సంస్థల మధ్య సమన్వయం, సన్నద్ధత, ప్రతిస్పందనను అంచనా వేయడానికి ఈ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ విభాగం DSP తిరుపతి మాట్లాడుతూ.. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఆక్టోపస్ పోలీస్‌ల సంసిద్ధతను అంచనా వేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు.
Also Read: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఇది నిరంతరం కొనసాగుతుంది అని తెలిపారు. మా సన్నద్ధతను మెరుగు పరుచుకోవటంతో పాటు మరింత వేగంగా ప్రతిస్పందించేందుకు కృషిని కొనసాగిస్తామని తెలిపారు. మాక్ డ్రిల్ కు ముందు పోలవరం పోలీస్ లు, ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షించే SPF సిబ్బంది, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ MEIL అధికారులతో ఆక్టోపస్ పోలిసుల బృందం సమావేశమైంది.
Also Read: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!
Also Read: శ్రీతేజ్ కు టుం బా నికి అండగా 'పుష్ప2' టీమ్.. హాస్పిటల్ వెళ్లిన బన్నీ