AP: ఏపీలో మరోసారి ఎండ తీవ్రత.. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..!
ఏపీలో వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు వర్షాలు పడగా.. సోమవారం నుంచి మళ్లీ ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.