AP : వైసీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు!
ఏపీలో జరుగుతున్న అల్లర్లకు వైసీపీ రౌడీ మూకలే కారణమని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ గెలవబోతుందనే కోపంతో వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందన్నారు.