AP: పాడె మోసి గురు భక్తిని చాటుకున్న మాజీ మంత్రి కాకాణి..!
AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన గురుభక్తిని చాటుకున్నారు. పొదలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిన గురువు సిద్దయ్య మృతి చెందడంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.