Minister Narayana To Make Review Meeting on Anna Canteens : ఈరోజు మధ్యాహ్నం 12.30కి మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ (Ponguru Narayana) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అన్న క్యాంటీన్ల (Anna Canteens) ఏర్పాటు, డ్రెయిన్లలో పూడిక తీత పనులపై సమీక్ష చేయనున్నారు. ఈ నెల 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డ్రెయిన్లలో పూడికతీత కోసం మున్సిపాల్టీలకు ఇప్పటికే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. పనులు జరుగుతున్న తీరుపై మున్సిపల్ కమిషనర్లు తో మంత్రి నారాయణ చర్చించనున్నారు. సచివాలయం (Sachivalayam) నుంచి జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
పూర్తిగా చదవండి..Anna Canteens : అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక భేటీ
AP: ఈరోజు అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డ్రెయిన్లలో పూడిక తీత పనులపై సమీక్ష చేయనున్నారు మంత్రి నారాయణ. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Translate this News: