Nandyal : నువ్వు సె*క్సీగా ఉన్నావ్.. పక్కలోకి వచ్చేయ్.. సీఐ రాసలీలలు!

తాజాగా నంద్యాలలో త్రీ టౌన్ సీఐ వేధింపులు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒంటరి మహిళలను టార్గెట్ చేసిన సీఐ కంబగిరి రాముడు..  తనను న్యూడ్ కాల్స్ చేయాలంటూ వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

New Update
ci nandhyal

న్యాయం కోసమని మహిళలు పోలీస్ స్టేషన్ మొట్లు ఎక్కితే కొందరు ఖాకీలు కామాంధులుగా మారుతున్నారు. తాజాగా నంద్యాలలో త్రీ టౌన్ సీఐ వేధింపులు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒంటరి మహిళలను టార్గెట్ చేసిన సీఐ కంబగిరి రాముడు(Nandyal CI E Kambagiri Ramudu)..  తనను న్యూడ్ కాల్స్(Nude calls) చేయాలంటూ వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనను, తన పిల్లలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు దిగితిన్నాడని సంచలన ఆరోపణలు చేసింది. సీఐపై ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు కూడా స్పందించడం లేదని బాధితురాలు ఆరోపిస్తుంది. న్యాయం కోసం ఇక తాను హోంమంత్రినే కలుస్తానని చెబుతోంది.

Also Read :  కవలలకు జన్మనిచ్చి బాలింత మృతి.. శవానికి ట్రీట్మెంట్ చేసిన ఏపీ డాక్టర్లు.. దారుణ ఘటన!

Also Read :  విజయవాడలో సైకో.. దసరా ముందు మటన్ కత్తితో పిన్నిని ముక్కలు ముక్కలుగా

పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రా  

సీఐ కంబగిరి రాముడు చేసిన వాట్సాప్ కాల్స్, మెసేజ్ లు అన్ని స్క్రీన్  షాట్లు(WhatsApp Chat leaked) బయటపెట్టింది. తనను సెక్సీగా ఉన్నావ్.. అన్ని నేను చూసుకుంటా.. ఖాళీగా ఉంటే పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రా  అంటూ గలీజ్ మెసేజ్ లు పెట్టాడని బాధితురాలు చెబుతోంది. సీఐ కారణంగా మానసికంగా కుంగిపోయా. ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నానని బాధితురాలు అంటుంది. అయితే బాధితురాలు ఆరోపణలను సీఐ రాముడు ఖండించారు. అవన్నీ అబద్ధాలు అని అంటున్నారు. తన దగ్గర కూడా ఆధారాలున్నాయని ఆయన అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు