AP News: ఎమ్మెల్సీ భరత్‌ మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి!

చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కుప్పంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భరత్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు వాల్ పోస్టర్లు వేయడం కలకలం రేపుతోంది.

MLC Bharat

MLC Bharat

New Update

AP News: చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భరత్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు వాల్ పోస్టర్లు వేయడం కలకలం రేపుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవి అనుభవించిన ఎమ్మెల్సీ భరత్.. ప్రభుత్వం మారగానే అడ్రస్ లేకుండా పోయారంటూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ పదవి అనుభవించిన భరత్.. ప్రస్తుతం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కుప్పంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు వరకు కుప్పం నియోజకవర్గంలో హల్‌చల్ చేసిన భరత్ ఎన్నికల తర్వాత నుంచి నియోజకవర్గంలో కనిపించడం లేదట.

వైసీపీకి అడ్డాగా మారుస్తానంటూ..

కుప్పం ఎమ్మెల్యేగా గెలిచేది తానేనని, ఈ నియోజకవర్గాన్ని వైసీపీకి అడ్డాగా మారుస్తానంటూ ఎన్నికల ముందు వరకు ప్రకటనతో ఊదరగొట్టిన భరత్.. నియోజకవర్గం ఓటర్లు ఇచ్చిన తీర్పుతో అడ్రస్ లేకుండా పోయారన్న చర్చ జరుగుతోంది. తాజాగా భరత్ కనిపించడం లేదంటూ సొంత పార్టీ నాయకులే పోస్టర్లు వేయడంపై చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఓవైపు సీనియర్ నేతలంతా వైసీపీని వీడుతుండగా.. మరికొందరు పేరుకు పార్టీలో ఉన్నా.. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం లేదనే చర్చ జరగుతోంది.

ఇది కూడా చదవండి:  తెలంగాణలో బిహార్ ముఠా చోరీలు.. ఏపీలో తెలంగాణ పోలీసుల కాల్పులు

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భరత్ కుప్పం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి చంద్రబాబుపై 48 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేస్తామంటూ ఎన్నికల ముందు వరకు చెప్పిన భరత్.. ఎన్నికల ఫలితాల తర్వాత ఆచూకీ లేకుండా పోయారట. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత జగన్ భరత్‌కు కుప్పంలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో పాటు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రయత్నాలను, కోరికను భరత్ నెరవేర్చలేకపోయాడు. కుప్పం మున్సిపాల్టీలో వైసీపీ గెలిచిన తర్వాత.. 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని వైసీపీ నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. చివరకు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భరత్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి:  ఆరోగ్యకరమైన స్నాక్స్‌.. ఆకలి అస్సలు ఉండదు

 

 

ఇది కూడా చదవండి:  చర్మం నిగనిగలాడాలంటే చిలగడదుంప ట్రై చేయండి

 

ఇది కూడా చదవండి:  ఈ ఐదు డ్రై ఫ్రూట్స్‌ చేసే మేలు అంతాఇంతా కాదు

#mlc-bharath
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe