Sweet Potato: చర్మం నిగనిగలాడాలంటే చిలగడదుంప ట్రై చేయండి

స్వీట్ పొటాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీ చర్మాన్ని దృఢంగా, మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచే ప్రోటీన్ చిలగడదుంపలో ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ముఖంపై గీతలు, ముడుతలను, చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
sweet potato

Sweet Potato

Sweet Potato: చిలగడదుంపలు ఆహారంలో చేర్చుకోవడానికి మంచి ఎంపిక. ఈ సూపర్‌ఫుడ్ చర్మాన్ని రక్షిస్తుంది. లోపలి నుంచి మెరుపును తీసుకొస్తుంది. చిలగడదుంపల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. పొడిబారిన లేదా పొరలుగా ఉండే చర్మంతో ఇబ్బంది పడుతుంటే చిలకగడదుంపలను ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. స్వీట్ పొటాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి ముఖ్యమైన పోషకం. కొల్లాజెన్ అనేది మీ చర్మాన్ని దృఢంగా, మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచే ప్రోటీన్. అధ్యయనం ప్రకారం 20-70 సంవత్సరాల వయస్సు గల 1,125 మందిపై పరిశోధనలు చేశారు.

చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

  • ప్లేసిబో చికిత్సలతో పోలిస్తే హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్ గణనీయంగా చర్మం, తేమ శాతాన్నది మెరుగుపరిచింది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ నిర్మాణానికి తోడ్పడుతుంది. ముఖంపై గీతలు, ముడుతలను తగ్గిస్తుంది. చిలకగడదుంపల్లోదని బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎని పెంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. చర్మానికి విటమిన్ ఎ అవసరం. హానికరమైన UV కిరణాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. సన్‌బర్న్, దీర్ఘకాలిక చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ అధిక స్థాయిలో ఉంటాయి. 

ఇది కూడా చదవండి: ముఖం చూసి ఆరోగ్యం చెప్పేసే ఏఐ టెక్నాలజీ

  • చర్మపు రంగును మెరుగుపరుస్తాయి. విటమిన్ ఎ స్కిన్ సెల్ టర్నోవర్‌ను ప్రోత్సహిస్తుంది. ఇది నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.  స్వీట్ పొటాటోలో మంచి మొత్తంలో నీరు ఉంటుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ ఐదు డ్రై ఫ్రూట్స్‌ చేసే మేలు అంతాఇంతా కాదు

Advertisment
Advertisment
తాజా కథనాలు