మద్యం వ్యాపారంలో వాటా ఇస్తావా? షాపు లేకుండా చెయ్యాలా?.. సీఎంకి మరో తలనొప్పి ఎమ్మెల్యేల తీరుతో చంద్రబాబు సర్కారుకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటుచేయాలంటే వారికి 30-40శాతం వాటా లేదా ఏటా రూ.30 లక్షలు ఇవ్వాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. By Seetha Ram 11 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ విధానం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ప్రొవిజినల్ లైసెన్సులు జారీ చేసింది. అక్టోబర్ 16 నుంచి చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. అయితే అవి నింబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అని ఎక్సైజ్ అధికారులు పరిశీలించి రెగ్యులర్ లైసెన్సు జారీ చేస్తారు. ఇది కూడా చదవండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్! ఇప్పటికీ ప్రొవిజినల్ లైసెన్సుతో 489 షాపులు కాగా ప్రొవిజినల్ లైసెన్సు జారీ చేసిన నాటి నుంచి కేవలం 10 రోజుల్లోనే రెగ్యులర్ లైసెన్సు ప్రక్రియ పూర్తవుతుంది. కానీ మద్యం షాపులు ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నా చాలా చోట్ల ఇంకా ప్రొవిజినల్ లైసెన్సుతోనే మద్యం దుకాణాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 489 దుకాణాలు ఇప్పటికీ ప్రొవిజినల్ లైసెన్సుతో కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఇలా జాప్యం కావడానికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే ప్రధాన కారణం అని తెలుస్తోంది. వాటా ఇవ్వాల్సిందే తమ నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలంటే వారికి వాటా కావాల్సిందేనని పట్టుబడుతున్నాని తెలుస్తోంది. 30 నుంచి 40 శాతం వాటా అయినా లేదా సంవత్సరానికి రూ.30 లక్షలు ఇవ్వాల్సిందేనని వ్యాపారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం. దీనికి అంగీకరించకపోతే అడ్డుంకులు సృష్టిస్తున్నారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే! భవనాలు అద్దెకు ఇవ్వకుండా బెదిరింపులు అంతేకాకుండా వ్యాపారులు తమ మద్యం దుకాణాల కోసం అనువైన ప్రదేశాన్ని చూసుకుంటే అక్కడకి తమ అనుచరులను పంపించి బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే స్థలాలు, భవనాలను సైతం వ్యాపారులకు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. దాదాపు ప్రకాశం, గుంటూరు, బాపట్ల, శ్రీసత్యసాయి, అనంతపురం, తిరుపతి, పల్నాడు, ఏలూరు, కర్నూలు, కాకినాడ, తూర్పుగోదావరి మరిన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 30 శాతం వాటా లేదా రూ.30 లక్షలు ఇది కూడా చదవండి: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్! సత్తెనపల్లె నియోజకవర్గంలో ఇదే తంతు కొనసాగుతున్నట్లు సమాచారం. 30 శాతం వాటా ఇస్తారా? లేక సంవత్సరానికి రూ.30 లక్షలు ఇస్తారా? అని ముఖ్యనేత కుమారుడు వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాపట్ల నియోజకవర్గంలో సైతం అదే జరుగుతుంది. 30 నుంచి 35 శాతం వాటా ఇచ్చే వరకు రెగ్యులర్ లైసెన్సు రాదని బెదిరిస్తున్నారని సమాచారం. ఒంగోలులో కూడా ఇలానే చేస్తున్నారని తెలుస్తోంది. తనకు 35 శాతం వాటా ఇవ్వకపోతే ఎక్కడా మద్యం షాపు ఏర్పాటుకు భవనాలు లభ్యం కానివ్వనని ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా వ్యాపారులు నష్టపోవడమే.. కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఇలానే ఇది కూడా చదవండి: మజ్లిస్ నేతలపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. వారే అలా చేస్తున్నారంటూ! అయితే గతంలో కూడా ఇలానే కొందరు ఎమ్యెల్యేలు వ్యవహరించారు. నూతన మధ్యం పాలసీకి లాటరి సమయంలో తమకు వాటా కావాలని ఒత్తిడి తీసుకొచ్చారు. తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు పెట్టవద్దని కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వ్యాపారులకు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. కాదని జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కానీ ఇప్పటికీ కొందరు మారడం లేదని తెలుస్తోంది. #cm-chandra-babu #ap new liquor policy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి