/rtv/media/media_files/2025/07/22/pagans-in-tirumala-2025-07-22-12-25-26.jpg)
Pagans in Tirumala
TTD:
కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలుచుకునే శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో(Tirumala Tirupati Temple) అపచారం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లో అన్యమత ఉద్యోగుల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. టీటీడీలో పనిచేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగుల(Employees) పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగుల వ్యవహరంపై టీటీడీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఒకరు మత ప్రచారకుడిగా పనిచేస్తుండగా, మరొకరు ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
టీటీడీ విద్యుత్తు విభాగంలో విధులు నిర్వహిస్తున్న శేఖర్ అనే ఉద్యోగి తిరుపతి గ్రామీణ మండలం అన్నాసాంపల్లెలో సొంత చర్చి నిర్వహిస్తూ అందులో మతబోధకుడిగా (పాస్టర్) వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఆయనను ఉద్యోగం నుంచి తప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా గత ఆదివారం బైబిళ్లు పంపిణీ చేస్తూ ప్రార్థనల్లో పాల్గొన్న కన్నిగను వెంటనే విధుల నుంచి తప్పించాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్
కాగా ఫిర్యాదులపై టీటీడీ పాలకమండలి చర్చించినట్లు తెలిసింది.‘‘టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రభోదకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిగ ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేశారు’’ అని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరిపై అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే.. గతంలోనూ తిరుమలలో అనేకమంది అన్యమత ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇంకా చాలామంది అన్యమతస్తులు టీటీడీలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
Also Read: Avatar Fire and Ash: అవతార్: ఫైర్ అండ్ ఆష్ బిగ్ అప్డేట్.. ఈ ట్విస్ట్ మాములుగా లేదుగా..!