విద్యావ్యవస్థను కూడా నాశనం చేశారు.. వైసీపీపై లోకేష్ ఫైర్ అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని.. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదని ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. '' జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేసారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు. వెయ్యి స్కూల్స్‌లో సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మేము వచ్చిన తరువాత టెస్ట్ పెడితే 90 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ భవిష్యత్తుతో గత ప్రభుత్వం ఆటలాడింది. టోఫెల్, ఐబీ కూడా అలాంటి నిర్ణయాలే కనీస అవగాహన లేకుండా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా నిర్ణయాలు అమలు చేసారు. 6,500 కోట్ల బకాయిలు ఉన్నాయి విద్యా వ్యవస్థలో ఇతర శాఖల్లో తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకోలేము. మనం తీసుకునే నిర్ణయం కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. అందుకే నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చిస్తాను. అది మనం అమలు చేయగలమా లేదా ? విద్యార్థులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకొనే నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వానికి పబ్లిసిటీ ఎక్కువ.. పని తక్కువ. ఫీజు రీఎంబర్స్‌మెంట్, వివిధ బిల్లులకు సంబంధించి రూ.6,500 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టి పోయారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై కూడా ఇప్పుడు సమీక్ష చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థను గాడిన పెడతాం. Also read: అదే మా లక్ష్యం.. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై చంద్రబాబు కీలక ప్రకటన ఛాలెంజ్‌గా తీసుకున్నాను నేను విద్యా శాఖ తీసుకుంటున్నా అని తెలియగానే ఎంతో మంది అది కష్టమైన శాఖ, అనేక సమస్యలు ఉన్నాయి, మీరు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేసిన నేను కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు అని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చెయ్యడమే నా ఎజెండా. కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఢిల్లీ మోడల్, కేరళ మోడల్ కాదు ఐదేళ్లలో అందరూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే విధంగా చేస్తాను. విలువలతో కూడిన విద్య అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైంది విలువలు. మహిళల్ని గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, తల్లితండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించడం లాంటివి విద్యలో భాగం కావాలి. ఎన్ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రానికి 3వ స్థానం సాధిస్తాం. అదేవిధంగా ప్రపంచంలో టాప్ 100 వర్సిటీల్లో ఏపీ వర్శిటీ ఉండేలా కృషిచేస్తాం. Also Read: రుషికొండ ఫైల్స్ మిస్సింగ్.. తలలు పట్టుకుంటున్న అధికారులు త్వరలోనే మెగా డిఎస్సీ కూడా నిర్వహిస్తున్నాం. క్లాస్‌కి ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలనేది నా లక్ష్యం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్ఠిక ఆహారం అందిస్తున్నాం. జోన్ల వారీగా పిల్లలకు నచ్చే భోజనం అందించాలి అని నిర్ణయం తీసుకున్నాం. క్వాలిటీ విషయంలో రాజీ ఉండదు. ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తప్పవు. చదువుతో పాటు పిల్లలకు ఆటలు, సైన్స్ కాంపిటీషన్లు రూడా పెట్టబోతున్నాం. గతంలో నాడు- నేడు అని పబ్లిసిటీ చేశారు. అసలు కొన్ని స్కూల్స్‌లో కూర్చోడానికి బల్లలే లేవు. అందుకే రాబోయే 3 ఏళ్లలో అన్ని స్కూల్స్‌లో కనీస సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, తాగునీరు, టాయ్‌లెట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ వంటివి కల్పించాలని ఆదేశాలు జారీ చేశానని'' మంత్రి లోకేశ్ అన్నారు. #andhra-pradesh #telugu-news #nara-lokesh #lokesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి