/rtv/media/media_files/2025/04/18/foHJhdsgAGO61SrIIsaF.jpg)
Govinda Betting App
Govinda Betting App : దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ఎంతమంది యువకుల ప్రాణాలు తీస్తున్నాయో రోజు చూస్తున్నాం. ఈ క్రమంలోనే యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో తెలంగాణలో బెట్టంగ్ యాప్స్ పై విచారణ మొదలైంది. పలువురు సినీప్రముఖులు, యాంకర్లు , సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్లు నా అన్వేషణ అన్వేష్ సజ్జనార్ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొంతమంది విచారణకు కూడా హాజరయ్యారు. పలువురు సెటబ్రిటీలు తమ సోషల్ మీడియా నుంచి యాప్ లను తొలగించారు. అయితే భక్తి పేరుతో బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న వైనం తాజాగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని కూడా యూట్యూబర్ నా అన్వేష్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేయగా.. మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు.
Also read: AP liquor scam: విచారణలో విజయసాయి రెడ్డి సంచలన విషయాలు
పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్‌ను కొన్నేళ్లుగా సినీతారలు నడుపుతున్నారని నా అన్వేష్ ఇందులో ఆరోపించారు. చాలామంది ప్రముఖులు, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వెబ్‌సైట్లలో ఈరోజు 16-4-2025 వరకు దీనిని నడిపిస్తున్నారని నా అన్వేష్ ఇటీవల ట్వీట్ చేశారు. అమాయకమైన యువతను వీటి నుండి కాపాడాల్సిందిగా కోరుతున్నానని, యాప్ నిర్వహాకులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ వీడియో విడుదల చేశారు. ఈ బెట్టింగ్ యాప్‌లో ఎంత గెలిచినా టాక్స్ ఉండదని.. సినీ తారలు, సెలబ్రిటీలు దీనిని ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. దేవుడి పేరుతో ఇలాంటి పనులు చేస్తున్నారని.. సనాతన ధర్మం కోసం పోరాడే వారు ఈ గోవిందా బెట్టింగ్ యాప్ మీద చర్యలు తీసుకోవాలని నా అన్వేష్ కోరారు.
Also Read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
దీంతో నా అన్వేష్ వీడియో, ట్వీట్‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. జూదానికి బానిసైన యువత నిరాశలో కూరుకుపోయిన వందలాది హృదయ విదారక కథలను వింటున్నానని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనిని ఇకనైనా ఆపాలన్న నారా లోకేష్.. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం దీనిపై అవగాహన కల్పించడం.. బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించడమేనని అన్నారు. మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచేలా యాంటీ బెట్టింగ్ పాలసీ తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామంటూ నారా లోకేష్ బదులిచ్చారు.
Also read; GST on UPI: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లుకు భారీ షాక్..!