Lokesh: జగన్ పై లోకేష్ సంచలన ట్వీట్

AP: చిన్న పిల్లల చిక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన జగన్‌ సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని లోకేష్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న జగన్‌ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

lokesh
New Update

Lokesh: సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాజీ సీఎం జగన్ వేసిన ఆరు ప్రశ్నలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పుని తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉందని సెటైర్లు వేశారు. గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకూ మీరు నా నెత్తిన పెట్టి పోయిన బకాయిలు అక్షరాలా రూ. 6,500 కోట్లు జగన్ అని అన్నారు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన మీది అని ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్ బాల్ ఆడుకుంది మీరు అని నిప్పులు చెరిగారు.

ప్రతిపక్షంలోకి రాగానే విలువలు...

లోకేష్ ట్విట్టర్ లో..." అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది సుప్పిని జగన్. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో రూ.3500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నేను యువగళం పాదయాత్ర చేసేటప్పుడే మీ నిర్వాకాన్ని విద్యార్థులు నా దృష్టికి తెచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సమస్య పరిష్కరించాం. గత ప్రభుత్వ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే అందజేయాల్సిందిగా కళాశాలలను ఆదేశించాం. ఇకపై ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా ఇటీవలే నిర్ణయం కూడా తీసుకున్నాం. 

2. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయాలు తీసుకుని గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీ అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా? 
ఉపాధ్యాయులు, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే సిబిఎస్ఈ పరీక్షా విధానం తీసుకొచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక సిబిఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించిన పరీక్షల్లో 90శాతం మంది ఫెయిలయ్యారు. నీ నిర్ణయాలు బ్లైండ్‌గా ఫాలో అయితే ఆ పిల్లలు అంతా బోర్డు పరీక్షల్లో తప్పి డిప్రెషన్లోకి వెళ్లేవారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంచకుండా, టోఫెల్, ఐబీ శిక్షణ ఇచ్చేవారు లేకపోయినా 
అమలు చేసామని డబ్బా కొట్టుకోవడం. ఇలా ఒక్కటేంటి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం మీదే జగన్ గారు. 

3. నాడు - నేడు అంటూ పబ్లిసిటీ పీక్‌కు తీసుకెళ్లారు కానీ విషయం వీక్ అని తేలింది. నా క్షేత్రస్థాయి పర్యటనల్లో కనీసం పిల్లలు కూర్చోడానికి బల్లలు, తాగునీరు, టాయ్ లెట్లు  లేని పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. ఇక ట్యాబులు ఇంటికి ఇవ్వడం వలన జరుగుతున్న అనర్ధాలను మీరు నేరుగా తల్లితండ్రులను అడిగి తెలుకోవచ్చు. అందుకే మేము స్కూళ్లలోనే పిల్లల సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. 

Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు

4.రాష్ట్రంలో గత ఐదేళ్లలో మీ వల్ల భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత. మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డిఎస్సీతో భర్తీచేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి తీరుతాం.లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపజేసే కనికట్టు విద్యలో మాస్టర్స్ చేసిన మీకు విద్యారంగంలో మేం చేస్తున్న మంచిపనులు కన్పించకపోవచ్చు. ఎవరేమనుకున్నా రాబోయే ఐదేళ్లలో ఏపీ విద్యారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని చంద్రబాబుగారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పించింది. మీలాంటి మారీచులు ఎంత తప్పుడు ప్రచారం చేసినా విద్యారంగ సంస్కరణల విషయంలో మా అడుగు ముందుకే!." అని జగన్ కు కౌంటర్ ఇచ్చారు.

Also Read: చంద్రబాబుకు జగన్ 6 ప్రశ్నలు.. చెప్పే దమ్ముందా అంటూ..!

Also Read: ఝార్ఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?

#lokesh #jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe