BIG BREAKING: కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.

New Update
Kashibugga Stampede

Kashibugga Stampede

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. కాశీబుగ్గలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన లోకేశ్‌.. ఆ తర్వాత పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 

Also Read: రైలులో మంటలు.. కిందికి దిగి పరుగులు తీసిన ప్రయాణికులు

వేంకటేశ్వర స్వామి గుడిని 94 ఏళ్ల వృద్ధుడు తన సొంత ఖర్చుతో నిర్మించారు. ఆలయానికి ఇంతమంది భక్తులు వస్తారని ఎవరూ కూడా ఊహించలేదు. బారికేడ్లు ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువయ్యింది. దీంతో ఆలయ రద్దీపై మంత్రి, ఎమ్మెల్యే, అధికారులను అలెర్ట్ చేశాం. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. 

Also Read: ఆ ఒక్క తప్పే 9 మంది భక్తుల ప్రాణాలు తీసింది.. శ్రీకాకుళం తొక్కిసలాటలో విస్తుపోయే నిజాలు..!

ఈ తొక్కిసలాట ఘటనపై గుడి నిర్వాహకులు, సిబ్బందిని విచారిస్తాం. పలాస ఆస్పత్రిలో 16 మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ల ఎలాంటి ప్రాణాపాయం లేదు. తీవ్రగాయాలైన వాళ్లకి మెరుగైన చికిత్స అందిస్తున్నామని'' లోకేష్ తెలిపారు. ఇదిలాఉండగా కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా ఆ ఆలయానికి శనివారం భారీగా భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. మరోవైపు ప్రధాని మోదీ కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు