Mastan Sai  : మస్తాన్ సాయి కి మరోషాక్.. ఆ దర్గా నుంచి ఔట్

రెండు తెలుగు రాష్ట్రల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనం సంచలనం సృష్టిస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది లేఖరాయడంతో కలకలం రేగింది.

New Update
 Mastan Sai

Mastan Sai

Mastan Sai  : రెండు తెలుగు రాష్ర్టాల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనం సంచలనం సృష్టిస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది లేఖరాయడంతో కలకలం రేగింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చింది లావణ్య. ఇదిలా ఉండగానే ఆ తర్వాత కూడా లావణ్య నిత్యం ఏదో ఒక అంశంలో వార్తల్లో ఉంటూనే ఉంది. తాజాగా రాజ్ తరుణ్, లావణ్యలతోపాటు పలువురు యువతుల బోల్డ్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారం మరో సంచలనమైంది. మస్తాన్ సాయి వందలాది మంది యువతుల నగ్న వీడియోలు సేకరించాడని ఆరోపించింది లావణ్య. 

Also Read :  Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

 ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మస్తాన్ సాయి కేసుపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు ఇవాళ(ఆదివారం) లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది కోరారు. దర్గా ధర్మకర్త కొడుకు అయిన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర, భద్రతకు, భంగం వాటిల్లుతుందని అటువంటి వ్యక్తి తండ్రిని ధర్మకర్తగా ఎలా కొనసాగిస్తారని లేఖలో న్యాయవాది ప్రస్తావించారు.
మస్తాన్ సాయిపై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం, ఇలా సుమారు ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని లాయర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో న్యాయవాది నాగూరు బాబు తెలిపారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలు లేఖలో లావణ్య న్యాయవాది నాగూరు బాబు ప్రస్తావించారు.
Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

మస్తాన్ సాయి కేసులో కేసులో నార్కోటిక్స్ పోలీసులు పలు విషయాలు గుర్తించారు. మస్తాన్ సాయి దగ్గర స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వాటిలో విచ్చలవిడిగా డ్రగ్స్ వీడియోలు వైరల్‌గా మారాయి. వాటి ఆధారంగా డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను నార్కోటిక్‌ పోలీసులు సేకరిస్తున్నారు. మస్తాన్ సాయి స్నేహితుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఉన్న ఎనిమిది మంది అమ్మాయిలు, పది మంది అబ్బాయిల వివరాలను నార్కోటిక్ పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. పలువురి కోసం ఏపీలోని పలు జిల్లాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు