/rtv/media/media_files/2025/01/29/szgeZ3g0SpyJJIvA1hu0.webp)
Married Women And Young Boy Suicide
Andhra Pradesh: విశాఖపట్నం జిల్లాలో నిమిషాల వ్యవధిలో వివాహిత, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం రెండు ఆత్మహత్యలతో ఉలిక్కిపడింది. ఒకే ఊరిలో ఒకే రోజున లక్ష్మి, ఆదిత్యలు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశం కాగా.. ఓ మిస్టరీగా మారింది. ఒకే రోజు జరిగిన ఈ ఘటనలతో కృష్ణాపురంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఒకేసారి ఇద్దరూ (వివాహిత, యువకుడు) ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అనే విషయంపై ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. వేర్వేరుగా జరిగిన రెండు ఆత్మహత్యలకు ఒకే కారణమని తెలిసి అంతా అవాక్కయ్యారు.
ఇది కూడా చదవండి: Gongadi Trisha : అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి త్రిష సంచలనం
విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంనకు చెందిన కనకల శంకరరావు లారీ డ్రైవర్ కాగా.. అతడి భార్య లక్ష్మి ఇంటి దగ్గరే ఉంటారు. సోమవారం శంకరరావు విధులకు వెళ్లిన తర్వాత భార్య లక్ష్మి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె మరిది ఇంటికి రాగా.. ఆమె ఫ్యాన్‌కు వెలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో కిందకు దించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. మరి కొన్ని నిమిషాల వ్యవధిలోనే అదే ఊరికి చెందిన మొకర ఆదిత్య అనే యువకుడు.. ఊరి శివారున ఆడ కొండల్లోని ఒక గోడౌన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చసుకున్నాడు. కొంతమంది మేకల కాపర్లు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు.
లక్ష్మి వయసు 30 ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త శంకర్రావు లారీ డ్రైవర్. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఇక మొకర ఆదిత్య వయసు 22 ఏళ్లు. పెళ్లి కాలేదు. చదువు మధ్యలో ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరి ఒకే ఊరు... అదే అసలు ట్విస్ట్.. శంకర్రావు లారీ డ్రైవర్ కావడంతో రోజుల తరబడి ఇతర ప్రాంతాలకు వెళుతుంటాడు. పిల్లలు స్కూలుకు వెళుతుండటంతో లక్ష్మి ఒక్కతే ఒంటరిగా ఉండేది. ఆ సమయంలోనే ఆదిత్యతో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమ..అ తర్వాత వివాహేతర సంబధానికి దారితీసింది. కొంతకాలం బాగానే సాగిన ఆ తర్వాత ఆనోట.ఈనోట విషయం రెండు కుటుంబాల్లో తెలిసింది. దీంతో గొడవలు మొదలయ్యాయి. గొడవలు మరింత ఎక్కవవడంతో పాటు కలిసి ఉండలేమని తెలిసి ఆదిత్య ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చివరిగా లక్ష్మితో వీడియోకాల్ మాట్లాడి సూసైడ్ చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Gurumurthy: 8గంటలు 16 వస్తువులు.. మీర్‌పేట్ మాధవి మర్డర్ కేసులో కీలక అప్ డేట్!
ఈ ఘటనలపై పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ రికార్డింగ్‌లు, చాటింగ్‌లను పోలీసులు గుర్తించారు. కలిసి జీవించడం సాధ్యం కాదని.. క్షణికావేశంలో ఆదిత్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా వెను వెంటనే.. లక్ష్మి సైతం తన ఇంటిలో ఉరేసుకొని మృతి చెందింది. ఆదిత్య ఉరేసుకునే సమయంలో లక్ష్మికి వీడియోకాల్ చేయడంతో మనస్థాపంతో తను కూడా ఉరేసుకొని మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు పేర్కొంటున్నారు. వేర్వేరుగా జరిగిన రెండు ఆత్మహత్యలకు ఒకే కారణమని తెలియడంతో ఊరంతా అవాక్కయింది.పోస్టుమార్టం అనంతరం లక్ష్మి, ఆదిత్య మృతదేహాల్ని విడివిడిగా గ్రామానికి తీసుకొచ్చి విడివిడిగా దహనం చేశారు. ఆత్మహత్యలకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని.. సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పద్మనాభం పోలీస్ స్టేషన్ సి.ఐ సి.హెచ్.శ్రీధర్ తెలిపారు.