/rtv/media/media_files/2025/01/29/uXuV4XO2oMPoZJrRm1Tv.jpg)
Under-19 Women's T20 World Cup
Gongadi Trisha: మలేషియా వేదికగా మహిళల అండర్ 19 ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలి సిందే. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో విజయం సాధించింది. స్కాట్లాండ్‌పై టీమిండియా 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు ఇప్పటికే తదుపరి రౌండ్‌లో తన స్థానాన్ని ఖాయం చేసు కుంది. ఈ మ్యాచ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి సెంచరీ సాధించింది. ఈ టోర్నీలో విశేషంగా రాణిస్తున్న తెలుగమ్మాయి.. సూపర్-6 లో భాగంగా స్కాట్లాండ్‌తో పోరులోనూ అదే పునరావృతం చేసింది. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా గొంగడి త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఏకంగా 53 బంతుల్లో సెంచరీ కొట్టింది. ఇన్నింగ్స్ ఆసాంతం బ్యాటింగ్ చేసిన ఈ ప్లేయర్.. నాటౌట్‌గా నిలిచింది. జట్టు స్కోరును 200 పరుగుల మార్కును దాటించింది. ఈ ఇన్నింగ్స్ తో మహిళల అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా త్రిష రికార్డు సృష్టించింది. దీంతో పాటు ఆయుషి శుక్లా కూడా తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది.
తెలుగమ్మాయి గొంగడి త్రిష సూపర్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 59 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేసింది. 186.44 స్ట్రైక్ రేట్‌తో కొనసాగిన త్రిష ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాదారు. ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 మహిళల ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రీడాకారిణిగా త్రిష చరిత్ర సృష్టించారు. గతంలో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన జీఈ స్క్రీవెన్స్ పేరిట ఉండేది. 2023లో ఐర్లాండ్‌పై 93 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. ఈ రికార్డు భారత జట్టు పేరిట మాత్రమే ఉంది. 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై భారత్ 219 పరుగులు చేసింది.
బ్యాటింగ్ లో దుమ్మురేపిన భారత జట్టు ఆ తర్వాత బౌలింగ్లో కూడా అదరగొట్టింది. కేవలం 14 ఓవర్లలో స్కాట్లాండ్‌ను 58 పరుగులకే ఆలౌట్ చేసింది. స్కాట్లాండ్‌కు చెందిన నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లు పిప్పా కెల్లీ, ఎమ్మా వాల్‌సింగమ్‌ల బ్యాట్‌ల నుండి అత్యధిక పరుగులు వచ్చాయి. ఇద్దరూ 12-12 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. బ్యాట్ తో సెంచరీ కొట్టిన త్రిష బౌలింగ్ లో కూడా అదరగొట్టింది. త్రిష మూడు వికెట్లు పడగొట్టింది. అలాగే, ఆయుషి శుక్లా కూడా 3 ఓవర్లలో 8 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది.
తెలుగమ్మాయి గొంగడి త్రిష తెలంగాణలోని భద్రాచలంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసు నుంచే తండ్రి క్రికెట్ ఆడటం నేర్పించారు. కేవలం తొమ్మిదేళ్ల వయసులో ఆమె హైదరాబాద్ అండర్-16 జట్టులో భాగమైంది. ఆ తర్వాత అండర్-23 కూడా ఆడింది. త్రిష తన విజయానికి తన తండ్రే కారణ మంటోంది. గంటల తరబడి తనతో ప్రాక్టీస్ చేయించాడని, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Gurumurthy: 8గంటలు 16 వస్తువులు.. మీర్‌పేట్ మాధవి మర్డర్ కేసులో కీలక అప్ డేట్!
సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో రాణిస్తున్న యువ క్రికెటర్ గొంగడి త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అండర్-19 మహిళల విభాగంలో మొట్ట మొదటి సెంచరీ సాధించిన క్రీడాకారిణిగా నిలిచి, ప్రపంచ వేదికపై మన దేశ సత్తా చాటిన తెలంగాణ బిడ్డ మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!
కేటీఆర్ ప్రశంసలు
అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళగా తెలంగాణ అమ్మాయి త్రిష గొంగిడి రికార్డు సృష్టించడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫీట్ సాధించిందని కొనియాడారు. దేశ గౌరవాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావని ప్రశంసించారు. ఐసీసీ అండర్ 19 టీ 20 మహిళల ప్రపంచకప్ లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్ఉమెన్గా రికార్డ్ సాధించి.. ఎంతోమంది మహిళలకు, మహిళా క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచిందని త్రిష గొంగడిని కేటీఆర్ కొనియాడారు. ఆమెకు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. మరికొన్నాళ్లలోనే టీమిండియా మహిళా క్రికెట్‌లో అడుగు పెడతావని.. కెప్టెన్‌గా చూస్తామని ఆశిస్తున్నానని అన్నారు.