జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు(nellore) జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. AK 47గన్ తో ఆయన్ను ఉగ్రవాదులు కాల్చినట్లుగా సమాచారం. బెంగుళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మధుసూదన్ రావు హాలీడే ట్రిప్ కోసమని కుటుంబంతో కలిసి కశ్మీర్ వెళ్లి అక్కడ ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. మధుసూదన్ రావు తల్లిదండ్రులు ఇద్దరూ హార్ట్ పేషేంట్స్ కావడంతో ఇంకా అతను చనిపోయిన విషయాన్ని బంధువులు చెప్పలేదు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుసూదన్ రావు నెల్లూరు జిల్లా కావలి కి చెందిన వ్యక్తి శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది, ఏకే 47 గన్ తో వెంటాడి వేటాడి చంపారు. 💥💥
— CHALLA VENU GOPAL YADAV (నేను మోదీ గారి కుటుంబం) (@VENUYADAV4BJP) April 23, 2025
Also Read : Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత