AP: నేటి నుంచి క్వార్టర్‌ రూ.99...అమల్లోకి నూతన మద్యం పాలసీ

నేటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 99 రూపాయలకే క్వార్టర్‌ బాటిల్‌ మద్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Liquor Shop
New Update

AP New Liquor Policy : నేటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. ఏపీలో మద్యం షాపుల లాటరీ పూర్తికావడంతో షాపుల కేటాయింపు జరుగుతోంది. నేటి నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న బ్రాండ్లన్నీ తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో 99 రూపాయలకే ఇవ్వాలని భావించిన క్వార్టర్ బాటిల్ మద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read:  తీవ్ర అల్పపీడనం..రేపు తీరం దాటనున్న వాయుగుండం!

గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం భారీ ధరలతో మందుబాబులు అల్లాడిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ మద్యాన్ని రూ.99కే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాలుగు జాతీయ కంపెనీలతో వీటి సరఫరా కోసం చర్చలు జరుపుతోంది. అయితే ఎంత స్టాక్ తీసుకోవాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆరంభంలో ఓ 2 లక్షల కేసులు తీసుకుని ఆ తర్వాత మిగిలిన స్టాక్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. 

ఉదయం 10 నుంచి అమ్మకాలు..

కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా క్వార్టర్‌ రూ.99 ధరతో మద్యం అందుబాటులోకి తెస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగా వారంలోపు దీన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.99కే క్వార్టర్ బాటిల్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోనూ సప్లై చేస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి తొలుత 2 లక్షల కేసులు తీసుకోబోతున్నారు. అనంతరం మందుబాబుల స్పందన చూసి తర్వాత స్టాక్‌కు ఆర్డర్ పెట్టబోతున్నారు.

Also Read:  అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురి మృతి!

మరోవైపు మద్యం ధరల విషయంలోనూ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ఓ కమిటీని నియమించబోతోంది. ఇప్పటికే ఉన్న మద్యం బాటిళ్ల ధరలను ఈ కమిటీ సవరించి ఫైనల్ చేస్తుంది. ఇందులో పాత బ్రాండ్ల ధరల సవరణతో పాటు కొత్త బ్రాండ్ల ధరల నిర్ణయం కూడా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కమిటీ నిర్ణయించిన కొత్త ధరల మేరకే విక్రయాలు జరగబోతున్నాయి.  ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. 

Also Read:  మరిన్ని ఇళ్ళ ముందు స్టే బోర్డులు..రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్రతి షాపులోనూ డిజిటల్‌ పేమెంట్స్‌..

ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా నిర్ణయం తీసుకుంది సర్కార్. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడగా.. కూటమి ప్రభుత్వం మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటర్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్ధతిని అవలంభించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. రాష్ట్ర పరిపాలనకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి.

Also Read:  సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రత..24/7 పోలీస్ పెట్రోలింగ్

#andhra-pradesh #chandrababu #ap-liquor-policy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe