America-Ap: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురి మృతి!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మృతి చెందారు. రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
accident

America-Ap: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ దారుణ ఘటన జరగ్గా ఈ ప్రమాదంలో ఐదుగురు ఎన్‌ఆర్ఐలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ మహిళ సహా ముగ్గురుఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు.

Also Read:  తీవ్ర అల్పపీడనం..రేపు తీరం దాటనున్న వాయుగుండం!

దక్షిణ బాన్‌హామ్‌ కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవే పై సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

తిరుపతి జిల్లా..

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు , మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లామని ప్రవాస భారతీయ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి టెక్సాస్‌ పబ్లిక్‌ సేఫ్టీ వర్గాలు ప్రకటించాయి.

Also Read: ఎయిర్ ఇండియాతో పాటూ మరికొన్ని విమానాలకు బాంబు బెదిరింపు

ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో చనిపోయినవారిని తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. 

విషమంగా...

వారిని తిరుమూరు గోపి.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరితలుగా అధికారులు ధృవీకరించారు.హరిత భర్త సాయి చెన్ను ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యం కొనసాగుతోంది.

Also Read:  ప్రజా మేధావి.. సాయిబాబా ఎప్పటికీ సజీవుడే!

ఈ ప్రమాదంపై అమెరికాలో తెలుగు సంఘాల ప్రతినిధులు దిగ్భ్రాంతి కి గురయ్యారు. ఈ ప్రమాదంలో చనిపోయిన గోపి, శివ, హరితల మరణంపై సంతాపాన్ని తెలిపారు. సాయి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

Also Read: యువకుడిని కొట్టి చంపిన గ్యాంగ్.. భార్యకు గర్భస్రావం

ఆర్టీసీ బస్సు బోల్తా.. వృద్ధురాలు మృతి

ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఓ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఈ దారుణం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఆర్టీసీ బస్సు ఏలూరుకి ప్రయాణిస్తోంది.

ఇలా పడటం వల్ల బస్సులోని ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. ఇంతలో వేరే ప్రైవేట్ బస్సులోని వారు ప్రయాణికులను కాపాడారు. మొత్తం 36 మందితో ప్రయాణిస్తున్న బస్సులో వృద్ధురాలు విమలాబాయ్‌ మృతి చెందింది. ఒకరి మీద ఒకరు పడటం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు