Lady Aghori:
అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఏపీలోని మంగళగిరిలో హల్ చల్ చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్ కళ్యాణ్‌ను కలిశాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అఘోరి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా వారిపైనే దాడికి యత్నించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అఘోరీ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం భార్య
అఘోరీ రీసెంట్‌గా తెలంగాణలో ప్రత్యక్షమైంది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా మధిరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో అఘోరి పాల్గొంది. అనంతరం అదే వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని హాజరైంది. దీంతో లేడీ అఘోరి అక్కడికి రాగానే నందిని ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ!
స్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షమైంది. ఇక్కడ కూడా పలు ప్రముఖ ఆలయాలను సందర్శించిన అనంతరం తాజాగా తెలంగాణ బాట పట్టింది. ఈ మేరకు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓ స్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు చేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట ట్రెండ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు
అత్యాచారాలు, గోహత్యల నివారణకే పూజలు చేశానని తెలిపింది. అంతేకాకుండా లోక కళ్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని పేర్కొంది. అలాగే హిందూ దేవాలయాలు, మహిళలపై దాడి చేస్తున్న వారి మర్మాంగాన్ని కొయ్యబోతున్నానంటూ ఇటీవల హెచ్చరించింది. అదే సమయంలో అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చింది. ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యలను ఆపుదాం అని పేర్కొంది.
మసీదును కూల్చేస్తా
ఇది కూడా చదవండి: అఘోరీ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం సతీమణి.. వీడియో వైరల్
ఇది కాకుండా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదును కూల్చేస్తా అని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలతో తనకు పనిలేదని తెలిపింది. తన పని తాను చేసుకుని పోతానని పేర్కొంది. ఆడపిల్ల మీద చేయి వేస్తే అది కోసేస్తా అని తెలిపింది. ధర్మం తర్వాతే ఏదైనా, ఎవరైనా అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడులో ప్రస్తుతం అఘోరి ఉంది.