Lady Aghori: అఘోరీ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం సతీమణి.. వీడియో వైరల్ లేడీ అఘోరీ తెలంగాణలో మళ్లీ ప్రత్యక్షమైంది. ఖమ్మం జిల్లా మధిరలో దర్శనమిచ్చింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. అదే సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని అఘోరీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. By Seetha Ram 18 Nov 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి అఘోరీ మళ్లీ తెలంగాణలో ప్రత్యక్షమైంది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా మధిరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో అఘోరి పాల్గొంది. అనంతరం అదే వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని హాజరైంది. దీంతో లేడీ అఘోరి అక్కడికి రాగానే నందిని ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు లేడీ అఘోరి కాళ్లు మొక్కిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందినిఖమ్మం జిల్లా మధిరలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యక్షమైన అఘోరి.. ఈ తరుణంలోనే అఘోరి ఆశీర్వాదం తీసుకున్న మల్లు నందిని. pic.twitter.com/cbvvst59Po — Telugu Scribe (@TeluguScribe) November 17, 2024 ఇదిలా ఉంటే గత నెల రోజులుగా లేడీ అఘోరి నాగసాధు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొదట తెలంగాణలో అడుగుపెట్టిన అఘోరి రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలను సందర్శించింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ తల్లి విగ్రహం ధ్వంసం చేసిన సమయంలో అక్కడికి వెళ్లి నగ్నంగా పూజలు చేసింది. ఇది కూడా చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ! దీంతో అక్కడి నుంచి అఘోరీ సంచలనంగా మారింది. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా తాను సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపింది. ఇందులో భాగంగానే తాను ఆత్మర్పణం చేసుకుంటానని తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను రెండు రోజులు నిర్భందించి ఆ తర్వాత విడిచిపెట్టారు. స్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షమైంది. ఇక్కడ కూడా పలు ప్రముఖ ఆలయాలను సందర్శించిన అనంతరం తాజాగా తెలంగాణ బాట పట్టింది. ఈ మేరకు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓ స్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు చేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట ట్రెండ్ అయ్యాయి. ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం! అత్యాచారాలు, గోహత్యల నివారణకే పూజలు చేశానని తెలిపింది. అంతేకాకుండా లోక కళ్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని పేర్కొంది. అలాగే హిందూ దేవాలయాలు, మహిళలపై దాడి చేస్తున్న వారి మర్మాంగాన్ని కొయ్యబోతున్నానంటూ ఇటీవల హెచ్చరించింది. అదే సమయంలో అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చింది. ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యలను ఆపుదాం అని పేర్కొంది. మసీదును కూల్చేస్తా ఇది కూడా చదవండి: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...! ఇది కాకుండా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదును కూల్చేస్తా అని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలతో తనకు పనిలేదని తెలిపింది. తన పని తాను చేసుకుని పోతానని పేర్కొంది. ఆడపిల్ల మీద చేయి వేస్తే అది కోసేస్తా అని తెలిపింది. ధర్మం తర్వాతే ఏదైనా, ఎవరైనా అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడులో ప్రస్తుతం అఘోరి ఉంది. #karthika masam pooja #lady aghori comments #lady aghori మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి