Andhra Pradesh: సీఎం జగన్ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్..
జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని కొనియాడారు. అంగన్వాడీలలో చిన్నపిల్లలకు పౌష్టికాహారం, రాగిజావ ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. బాధితుల దగ్గరకే డాక్టర్లు వెళ్లి పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.