Kurnool: పెళ్లి చేయలేదని తండ్రి పై కొడుకుల దాడి.. కాళ్ళు విరగొట్టి!

కర్నూల్ జిల్లాలో కన్న కొడుకులు తండ్రిపై దారుణానికి పాల్పడ్డారు. 35 ఏళ్లు వయసు వచ్చినా పెళ్లి చేయడం లేదని తండ్రిపై బలమైన కర్రలతో దాడి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రగాయాలపాలైన తండ్రి రాజును ఆస్పత్రికి తరలించారు.

New Update
ap crime

Kurnool district

Kurnool District :  వయసొచ్చినా పెళ్లి చేయట్లేదని కన్న తండ్రి అనే మానవత్వం లేకుండా చితకబాదారంట కన్న కొడుకులు. ఈ ఘటన కర్నూల్ జిల్లా గోనెగండ్లలో జరిగింది. 

Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

Also Read: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

బలమైన కర్రలతో దాడి

రాజు అనే వ్యక్తి కర్నూల్ జిల్లా గోనెగండ్లలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఈ కొడుకులు తండ్రిపై దారుణానికి పాల్పడ్డారు.   35 ఏళ్లు వయసు వచ్చినా పెళ్లి చేయడం లేదని  విచక్షణ కోల్పోయి తండ్రి పై బలమైన కర్రలతోదాడి చేశారు. అతని కాళ్ళు విరగొట్టి ఇంట్లో బంధించారు. ఇంతలో విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కన్న కొడుకుల దారుణం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలపాలైన తండ్రి రాజును బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్

Also Read: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు