Kurnool మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లను ఎలా వేధించారంటే?

కర్నూలు మెడికల్‌ కాలేజీలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్‌ని చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు అంటున్నారు.

karnool

Karnool

New Update

Karnool: కర్నూలు మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం జడలువిప్పింది. తాము చెప్పినట్టే వినాలంటూ జూనియర్లను సీనియర్లు వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్‌కి రోజురోజుకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఫస్టియర్ తరగతులు ప్రారంభమైన వారం రోజులకే జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని జూనియర్‌ విద్యార్థులు అంటున్నారు.

కాలేజీ హాస్టల్‌లో భోజనం తెమ్మని ఒత్తిడి:  

మూడు రోజుల క్రితమే యాంటీ ర్యాగింగ్ పేరుతో మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా మార్పు రాలేదు. ఇంతలోనే ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని జూనియర్లు అంటున్నారు. సీనియర్లు తాము చెప్పిన యాప్స్‌నే ఫోన్లలో వేసుకోవాలని, కాలేజీ హాస్టల్‌లో మెస్‌కి వెళ్లి భోజనం తెప్పించుకోవడంతో పాటు ప్లేట్లు కడగాలని ఒత్తిడి చేస్తున్నారని జూనియర్లు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నడుంనొప్పి కంటిన్యూగా వస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు

అంతేకాకుండా హాస్టల్‌ళోనే సిగరెట్లు, మద్యం తాగుతూ ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చేలోపే అంతా అప్రమత్తం అవుతున్నారని జూనియర్లు అంటున్నారు. అయితే కర్నూలు మెడికల్‌ కాలేజీలో 14వ తేదీ నుంచి ఫస్టియర్‌ క్లాసులు ప్రారంభమయ్యాయి. సీనియర్లు తరగతిగదుల్లోకి గుంపులుగా వచ్చి ర్యాగింగ్‌ చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ రైలులో మీరు ఎంత తిన్నా ఫ్రీ.. పైసా కట్టక్కర్లేదు

యాజమాన్యానికి విజ్ఞప్తి..

గతంలో కాలేజీల్లో ర్యాగింగ్‌ బూతానికి ఎంతోమంది విద్యార్థులు బలయ్యారు. అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మా పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నత ఉద్యోగం చేయాలి. కానీ ఇలా ర్యాగింగ్‌ వేధింపులతో విద్యార్థులని ఇబ్బంది పెడితే వారి భవిష్యత్‌కి.. చదువుకు ఆటంకం కలిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా ర్యాగింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటున్నారు. జూనియర్లు సైతం కాలేజీకి రావాలంటే భయపడే పరిస్థితులు ఉంటున్నాయి. కాలేజీ యాజమాన్యాలు ర్యాగింగ్‌ను నివారించకపోతే, అరికట్టకపోతే పోలీసులను ఆశ్రయిస్తామని, కేసులు పెడతామని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ఫ్యాట్‌ మొత్తం కరిగించే అద్భుతమైన పండ్లు ఇవే

#ap-news #kurnool #medical-college
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe