AP Crime: కర్నూలులో దారుణం.. తల్లిని చంపిన కసాయి కొడుకు

కర్నూలు జిల్లా బుధవార్‌పేటలో కన్నతల్లిని తాగుబోతు కొడుకు అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతురాలిని యల్లమ్మగా.. నిందితుడిని ఆమె కొడుకు జమ్మన్నగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Kurnool Crime News

Kurnool Crime News

Kurnool Crime News: ప్రతీ తల్లిదండ్రులకు చివరి క్షణంలో ఓ కోరిక ఉంటుంది. అది మరణం తర్వాత వారు తలకోరు పెట్టాలని ఆశ ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది కొడుకు చేతిలో తల్లి దారుణ హత్యకు గురి అవుతున్నారు. కన్న ప్రేమకు, అనుబంధాలకు నెలవైన తల్లి-కొడుకుల బంధం మరిచి మృగాళ్లగా మారుతున్నారు. కన్నతల్లిని అత్యంత క్రూరంగా చంపడం సమాజంలో కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న విలువల క్షీణతకు ఉదాహరణ. తాగా కన్న కొడుకు చేతిలో మరో తల్లి బలైంది. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

కసాయి కొడుకు చేతిలో తల్లి..

కర్నూలులోని బుధవార్‌పేటలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల వయసున్న కన్నతల్లిని తాగుబోతు కొడుకు అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతురాలిని యల్లమ్మగా.. నిందితుడిని ఆమె కొడుకు జమ్మన్నగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మన్నకు తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ప్రతి నెలా తల్లికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఆమెను తరచుగా వేధించేవాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే.. ఆమెపై దాడి చేసేవాడు. ఈ వేధింపులు రోజురోజుకు ఎక్కువయ్యాయి. నిన్న అర్ధరాత్రి మరోసారి జమ్మన్న మద్యం మత్తులో తల్లితో గొడవపడ్డాడు.

ఇది కూడా చదవండి: పెళ్లైన వ్యక్తితో సహజీవనం.. కూతుర్ని నరికి చంపిన తండ్రి.. ప్రియుడి పిటిషన్తో..!

ఈ గొడవ తీవ్రమై.. ఆ తర్వాత యల్లమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించింది. యల్లమ్మను గొంతు నులిమి చంపాడా లేక ముఖంపై దిండు వేసి ఊపిరాడకుండా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి జమ్మన్నను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ దారుణం గురించి విన్న స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాగుడు వ్యసనం ఒక కొడుకును కన్నతల్లిని చంపేంత కసాయిగా మార్చడం చూసి జనం ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.. తాగుడుకు బానిసలవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ విషాదకర సంఘటన సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. ఇలాంటి విపరీత ఆలోచనలు, నేరప్రవృత్తి పెరగడానికి గల కారణాలను విశ్లేషించుకోవాలి. కఠిన చట్టాలతోపాటు, మానవ సంబంధాల విలువలను తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు చేయాలని మరి కొందరూ అంటున్నారు.

ఇది కూడా చదవండి: మరో మహాపతివ్రత.. భర్తను చంపి లవర్ను ఇరికించి.. ట్విస్టుల మీద ట్విస్టులు!

Advertisment
తాజా కథనాలు