సీబీఐకి అవినాష్ రెడ్డి సంచలన లేఖ..వివేక హత్య కేసులో మరో ట్విస్ట్..!!
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. గతంలో వివేకా కేసును దర్యాప్తు చేసిన సీబీఐ (CBI) ఎస్పీ రామ్ సింగ్ పై అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. గతంలో వివేకా కేసును దర్యాప్తు చేసిన సీబీఐ (CBI) ఎస్పీ రామ్ సింగ్ పై అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పలు అంశాలను ప్రస్తావించింది. ఫొటోలు, గూగుల్ టేకౌట్, ఫోన్ల లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. జూన్ 30న సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను సీబీఐ కోర్టు ఇటీవల విచారణకు స్వీకరించింది.
ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లాలో మూడో రోజు పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలుత సీఎం ఉదయం ఇడుపులపాయ నుంచి కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకోని ప్రజాప్రతినిధులతో సమావేశమైయ్యారు. అనంతరం రాజీవ్ మార్గ్ రోడ్డు, రాజీవ్ పార్కు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. అక్కడ నుంచి బయలుదేరి కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని, ప్రియాంకగాంధీ టీంతో షర్మిల చేతులు కలపబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. నేడు వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల, సీఎం జగన్ సహా కుటుంబ సభ్యులు అంతా ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఎవరికి వాళ్లు వేర్వేరుగా బయల్దేరి వైఎస్ సమాధికి నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం.
వైఎస్సార్ జిల్లాలో వైసీపీ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నలుగురు ముఖ్య నేతలు.. లిటిగేషన్ పేరుతో పేదలు, బలహీనవర్గాల భూములను అక్రమంగా లాగేసుకుని కోట్ల రూపాయలను సంపాదించారని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్ వెంటనే స్పందించి.. పేదలు, బలహీనవర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిపై పులివెందుల పీఎస్‌లో కేసు నమోదైంది. సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని జయమ్మ కాలనీలో నివాసం వుంటున్న దస్తగిరి అదే వీధికి చెందిన తన కుమారుడు గూగుడు వల్లీని నిర్భంధించి, చిత్రహింసకు గురి చేస్తున్నారని అతడిని కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించిన తల్లి కుళ్లాయమ్మ.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గత మే 31న తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం అవినాష్‌కు నోటీసులు ఇచ్చింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది. అయితే నేటితో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు అంశం ఓ కొలిక్కి వస్తుందనుకుంటే సస్పెన్స్ మాత్రం వీడలేదు.
కడప జిల్లాలో నగ్నపూజలు కలకలం రేపాయి. లక్షల్లో డబ్బులు వస్తాయని అమ్మాయిలకు వల వేసి, డబ్బుల వీడియోలను చూపించి మోసం చేస్తున్నారు. చెప్పిన పని చేయకపోతే వీడియోలు వైరల్ చేస్తామని వేధింపులకు గురి చేసి, కడప జిల్లా రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.